Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గట్టెక్కిన స్టెఫానోస్ సిట్సిపాస్
- ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
పారిస్ : మహిళల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.1, జర్మనీ స్టార్ ఎంజెలికా కెర్బర్‌కు చుక్కెదురు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మూడో రౌండ్లోనే కెర్బర్ పోరుకు తెరపడింది. బెలారస్ అమ్మాయి అలిసాండ్ర సాన్సోవిచ్ చేతిలో వరుస సెట్లలో ఓటమి చెందింది. 6-4, 7-6(7-5)తో బెలారస్ గెలుపొందింది. రెండో సెట్ టైబ్రేకర్‌లో చివరి వరకు పోరాడిన కెర్బర్ నిరాశతో వెనుదిరిగింది. అమెరికా యువ సంచలనం కొకొ గాఫ్ మెరుపు విజయం సాధించింది. 6-3,6-4తో కానేపి (ఈస్టోనియా)పై విజయం సాధించింది. ఆరు ఏస్‌లు కొట్టిన గాఫ్.. పాయింట్ల పరంగా 69-57తో ఆధిపత్యం చెలాయించింది. కెనడా అమ్మాయి లీలా అనీ ఫెర్నాండేజ్ 7-5, 3-6, 7-5తో బెలిందా బెన్సిక్‌పై మూడు సెట్ల పోరులో పైచేయి సాధించింది. అలీజె కార్నెట్ (ఫ్రాన్స్) 6-0, 1-6, 6-3తో జెలెనా ఒస్టాపెంకోపై గెలుపొంది మూడో రౌండ్లోకి ప్రవేశించింది. ఎలిసీ మార్టెన్స్ 6-2, 6-3తో వార్వర గ్రాచేవాపై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్‌లో గ్రీసు యువ ఆటగాడు స్టెఫానోస్ సిట్సిపాస్ మారథాన్ మ్యాచ్‌లో గట్టెక్కాడు. నాలుగు సెట్లు, నాలుగు గంటలకు పాటు సాగిన మహా పోరులో నాల్గో సీడ్ సిట్సిపాస్ 6-3, 7-6(10-8), 6-7(3-7), 7-6(9-7)తో గెలుపొందాడు. చెక్ రిపబ్లిక్ కుర్రాడు కొలార్ గట్టి పోటీ ఇచ్చినా.. ముందంజ వేయలేకపోయాడు. 25 ఏస్‌లతో మెరిసిన సిట్సిపాస్.. మూడు బ్రేక్ పాయింట్లు సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు డీగో స్వార్ట్జ్మాన్ 6-3, 6-1, 6-2తో గ్రిగర్ దిమిత్రోవ్‌పై అలవోక విజయం సాధించాడు.