Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిమ్నాస్ట్ అరుణ ఫిర్యాదుపై సారు స్పందన
న్యూఢిల్లీ : భారత స్టార్ జిమ్నాస్ట్, ప్రపంచకప్‌లో పతక విజేత బుద్దా అరుణ రెడ్డి చేసిన ఆరోపణలపై విచారణ జరిపించేందుకు కేంద్ర క్రీడా ప్రాధికారిక సంస్థ (సారు) ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. బాకులో జరుగనున్న జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఎంపిక చేసేందుకు మార్చి 24న భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య జాతీయ శిక్షణ శిబిరం నిర్వహించింది. నేషనల్ క్యాంప్‌లో భాగంగా జిమ్నాస్ట్‌లకు ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించారు. ఫిట్‌నెస్ పరీక్షలో అరుణ రెడ్డి సమ్మతి లేకుండానే మొత్తం ప్రక్రియను వీడియో తీశారు. ఈ మేరకు అరుణ రెడ్డి.. సారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. సారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాధికా శ్రీమన్ ముగ్గురు సభ్యుల కమిటీకి నేతృత్వం వహించనున్నారు.