Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవటంపై మియాందాద్
కరాచీ : భారత్-పాక్ క్రికెట్ భావోద్వేగాల్లో జావెద్ మియాందాద్ మైదానంలో చేసిన చిలిపి చేష్టలు విమర్శలకు, వివాదాలకు దారితీసినా.. క్రికెట్ నైపుణ్యం విషయంలో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌కు గౌరవం ఇవ్వటంలో మియాందాద్ గొప్ప పరిణితి చూపిస్తూనే ఉన్నాడు. ఈ తరం బ్యాటర్లు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనేందుకు సునీల్ గవాస్కర్ వీడియోలు చూడాలని జావెద్ మియాందాద్ సూచించాడు. ' సునీల్ గవాస్కర్ ఎత్తు చూసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా పేసర్లను ఎలా ఎదుర్కొన్నాడేదని ఆమోఘం. అతడి నిలకడ, మెరుపు ప్రదర్శనలు విశేషమైనవి. సునీల్ గవాస్కర్ వీడియోలు చూసి ఈ తరం క్రికెటర్లు ఎంతో నేర్చుకోవచ్చు. వెస్టిండీస్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్టులో అరివీర భయంకర పేసర్లు ఉన్న తరంలో సునీల్ గవాస్కర్ మరుపురాని ప్రదర్శనలు చేశాడు. గవాస్కర్ బ్యాటింగ్‌ను నేను ఆస్వాదించేవాడిని. గవాస్కర్ ఏకాగ్రత, సంయమనం అసమానం. సునీల్ గవాస్కర్, గుండప్ప విశ్వనాథ్ ఒకే తరంలో ఆడటం భారత్ అదృష్టం' అని పీసీబీ విడుదల చేసిన ఓ వీడియోలో మియాందాద్ కొనియాడాడు.