Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ
న్యూఢిల్లీ : వరుస వైఫల్యాలు చవిచూస్తున్న స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి క్రికెట్ నుంచి విరామం తీసుకునే అంశాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ బ్రెట్ లీ అన్నాడు. ఆలోచనలు, ఆట, ఇతర అంశాల్లో తాజాదనం కోసం కోహ్లి కచ్చితంగా విరామం తీసుకోవాలని సూచించాడు. ' నా భావన ఆందోళనగా భావించవచ్చు. విరాట్ కోహ్లి పరుగుల వరద పారించటం నాకు ఇష్టం. బాధాకరమైన విషయం ఏమిటంటే, విరాట్ కోహ్లి పరుగులు చేయకుంటే జట్టు ప్రదర్శన పడిపోతుంది. 2016 ఐపీఎల్లో కోహ్లి 800-900 పరుగులు చేసినప్పుడు బెంగళూర్ గొప్పగా ఆడింది. మాకు ఆ కోహ్లి కావాలి. బలమైన కోహ్లి అంటే బలమైన జట్టు. క్వాలిఫయర్2కు జట్టును చేర్చలేకపోయాడు. ఆటతీరు సమీక్షించుకునేందుకు విరాట్‌కు ఇదో అవకాశం. లేదంటే అతడు కొంతకాలం క్రికెట్ నుంచి విరామం తీసుకోవటం మంచిది. ఈ పరిస్థితులకు దూరంగా, తాజా ఆలోచనలకు అవకాశం ఏర్పడుతుంది' అని బ్రెట్ లీ తెలిపాడు. ఐపీఎల్15లో విరాట్ కోహ్లి 16 మ్యాచుల్లో 341 పరుగులు చేశాడు. ఈ సీజన్లో విరాట్ బ్యాటింగ్ సగటు 22.73 మాత్రమే. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ నుంచి విరాట్ కోహ్లి విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు కోసం విరాట్ కోహ్లి భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు.
ఇదిలా ఉండగా, విరాట్ కోహ్లి 14 ఏండ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో చేయనన్ని తప్పిదాలు కేవలం ఈ ఒక్క ఐపీఎల్ సీజన్లోనే చేశాడని వీరెందర్ సెహ్వాగ్ అన్నాడు. ' ఇప్పుడు చూస్తున్నది మనకు తెలిసిన కోహ్లిని కాదు. భిన్నమైన కోహ్లి ఈ సీజన్లో ఆడాడు. ఈ సీజన్లో చేసిన తప్పిదాలు.. కోహ్లి కెరీర్ మొత్తంలోనే చేయలేదు' వీరూ అభిప్రాయపడ్డాడు.