Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిఖత్ జరీన్‌కు ఎంఎల్ఆర్ఐటి ఆర్థిక ప్రోత్సాహం
నవతెలంగాణ-హైదరాబాద్:
ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌కు ఎంఎల్ఆర్ఐటి కళాశాల విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. సహచర ఎంబీఏ విద్యార్థి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిందని బైక్ ర్యాలీతో నిఖత్ జరీన్‌ను ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగింపుగా కళాశాలకు తీసుకెళ్లారు. ఎంఎల్ఆర్ఐటి కళాశాలలో ఎంబీఏ చదువుతున్న నిఖత్ జరీన్‌కు కళాశాల ఆడిటోరియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆ విద్యా సంస్థల చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి రూ.4 లక్షల నగదు ప్రోత్సాహం అందజేశారు. ' అమ్మాయిలు ఏ విషయంలోనూ తక్కువ కాదు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. ఎంఎల్ఆర్ఐటి ఆర్థిక సహకారం మరు వలేనిది. కామన్వెల్త్ క్రీడల్లో పతకంతోనే తిరిగి కళాశాలకు వస్తాననని' నిఖత్ జరీన్ తెలిపింది.
' ప్రతి ఏడాది క్రీడా కోటాలో 30 మందికి ఉచిత విద్య అందిస్తున్నాం. రూ.1.25 కోట్ల వ్యయంతో క్రీడా ఉపకార వేతనాలు అందిస్తున్నాం. మా కళాశాల విద్యార్థి నిఖత్ జరీన్ ప్రపంచ విజేతగా నిలువటం గొప్ప గౌరవంగా భావిస్తున్నామని' ఎంఎల్ఆర్ఐటి చైర్మన్ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.