Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫాజ్జా బ్యాడ్మింటన్‌లో 17 పతకాలు
దుబాయ్: ఫాజ్జా పారా బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లు 17 పతకాలు (5 స్వర్ణం, 5 రజతం, 7 రజతం) కొల్లగొట్టారు. మనీషా రమాదాస్ రెండు స్వర్ణ పతకాలు చేజిక్కించుకోగా.. నిత్యశ్రీ, మానషి జోషి, తరుణ్ ధిల్లాన్, మన్దీప్ కౌర్, నితేశ్ కుమార్ రెండేసి పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. మహిళల ఎస్‌యూ5 విభాగంలో మనీషా 21-17, 21-11తో అకికో సుగినో (జపాన్)ను చిత్తు చేయగా.. డబుల్స్‌లో మన్దీప్ కౌర్‌తో కలిసి 21-9, 21-13తో థాయిలాండ్ జోడీని చిత్తు చేసి రెండు స్వర్ణాలు కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్ ఎస్ఎల్3లో ప్రమోద్ భగత్ 19-21, 21-17, 21-17తో భారత్‌కే చెందిన నితీశ్ కుమార్‌పై సాధికారిక విజయంతో స్వర్ణం కొల్లగొట్టగా.. నితీశ్ రజతం చేజిక్కించుకున్నాడు.