Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్వెల్త్ సెలక్షన్స్పై ఆశీష్ ఆరోపణలు
న్యూఢిల్లీ: భారత జిమ్నాస్టిక్స్ సమాఖ్య మరో వివాదంలో పడింది. ఫిట్నెస్ టెస్టును అనుమతి లేకుండా వీడియో తీశారని ఇటీవల స్టార్ జిమ్నాస్ట్ అరుణ రెడ్డి ఆరోపించగా.. తాజాగా అర్జున అవార్డు గ్రహీత ఆశీష్ కుమార్ కామన్వెల్త్ క్రీడలకు సెలక్షన్స్పై ఆరోపణలు చేశాడు. మార్చి 11-22న కామన్వెల్త్ క్రీడల కోసం నిర్వహించిన సెలక్షన్స్ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగలేదని ఆశీష్ కుమార్ లేఖాస్త్రం సంధించాడు. జాతీయ సమాఖ్యకు రాసిన లేఖ ప్రతిని 'సారు'కి సైతం పంపించాడు. ఎంపిక ప్రక్రియలో ప్రతిభ కొలమానం కాలేదని, పక్షపాత వైఖరి చూపించారని ఆశీష్ ఆరోపించాడు. 'సెలక్షన్స్ విషయమై జిమ్నాస్ట్ చేసిన ఫిర్యాదుపై వెంటనే స్పందించాలి. ఈ విషయమై జీఎఫ్ఐ నివేదిక సమర్పించాలి. జిమ్నాస్టిక్స్ సమాఖ్య సమాధానం తెలుసుకున్న అనంతరం అవసరమైతే విచారణ కమిటీని ఏర్పాటు చేస్తాం' అని సారు ఓ ప్రకటనలో తెలిపింది.