Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల జట్టు విభాగంలో స్వర్ణం
- ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ : ఐఎస్ఎస్ఎఫ్ షుటింగ్ ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా పతకాల ఖాతా తెరిచింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు విభాగంలో భారత్ పసిడి పతకం సాధించింది. ఎలవేనిల్ వెలరివన్, రమిత, శ్రేయ అగర్వాల్‌లు పసిడి గురితో భారత్‌కు బంగారు పతకం అందించారు. పసిడి పోరులో జర్మనీ షుటర్లు అనా నీల్సన్, ఎమా కోచ్, రికా ఇబ్సన్లు భారత త్రయం ముందు తేలిపోయారు. 17-5తో భారత్ స్వర్ణం కైవసం చేసుకుంది. పొలాండ్ మహిళల జట్టుకు కాంస్య పతకం లభించింది. భారత షుటర్ల త్రయం 90 రౌండ్లలో ఏకంగా 944.4 పాయింట్లు సాధించారు. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జట్టు విభాగంలో రుద్రాక్ష్ పాటిల్, పార్థ్ ముఖిజా, ధనుశ్ శ్రీకాంత్‌లు కాంస్య పతక పోరులో 10-16తో వెనుకంజ వేసి పతకం కోల్పోయారు.