Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ కొరియాతో మ్యాచ్ 4-4తో డ్రా
- ఆసియా కప్ టైటిల్ రేసు ఆశలు ఆవిరి
జకర్తా (ఇండోనేషియా) : డిఫెండింగ్ చాంపియన్ భారత్‌కు భంగపాటు. ఆసియా కప్ హాకీ సూపర్-4 దశలో సాధికారిక ప్రదర్శనలు చేసిన హాకీ ఇండియా.. అంతిమ సమరానికి గోల్ దూరంలో ఆగిపోయింది!. సూపర్-4 దశలో దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో తప్పన నెగ్గాల్సి ఉండగా.. యువ భారత్ 4-4తో డ్రా చేసుకుంది. భారత్, మలేషియా, దక్షిణ కొరియాలు ఐదేసి పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచినా.. ఓ గోల్ వ్యత్యాసంతో దక్షిణ కొరియా ముందంజ వేసింది. తొలుత జపాన్‌పై మలేషియా 5-0తో తిరుగులేని విజయం సాధించటంతో దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో భారత్‌కు విజయం తప్పసరిగా మారింది. ఆసియా కప్ టైటిల్ పోరులో మలేషియా, దక్షిణ కొరియా తలపడనుండగా.. 3వ స్థానం కోసం భారత్, జపాన్ ఢకొీట్టనున్నాయి. దక్షిణ కొరియాతో మ్యాచ్‌లో భారత్ 4 గోల్స్ కొట్టినా.. డిఫెన్స్‌లో తడబడి నాలుగు గోల్స్ కోల్పోయింది. నీలం సంజీప్ (9వ నిమిషం), దిప్సన్ టర్కీ (21వ నిమిషం), మహేశ్ శేష గౌడ (22వ నిమిషం), మరీశ్వరన్ (37వ నిమిషం) భారత్ తరఫున గోల్స్ కొట్టారు. నాల్గో క్వార్టర్లో 4-4తో అడుగుపెట్టిన భారత్ చివరి 15 నిమిషాల్లో చేసిన గోల్ ప్రయత్నాలు ఫలించలేదు.