Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 2 కోట్ల చొప్పున ప్రకటించిన సిఎం
నవతెలంగాణ, హైదరాబాద్
ప్రపంచ క్రీడా వేదికపై పసిడి పతకాలతో దేశం గర్వపడే ప్రదర్శన చేసిన తెలంగాణ క్రీడా ఆణిముత్యాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారీ నగదు ప్రోత్సాహకం ప్రకటించారు. ఇటీవల ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ మహిళల 52 కేజీల విభాగంలో వరల్డ్ చాంపియన్‌గా అవతరించింది. పసిడి పతకం ముద్దాడి భారత బాక్సింగ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మరోవైపు జర్మనీలో ముగిసిన ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచకప్ (షూటింగ్)లో ఇషా సింగ్ (నిజామాబాద్) మూడు బంగారు పతకాలు గెల్చుకుంది. ప్రపంచకప్‌లో పసిడి పతకాలు సాధించిన నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు సిఎం కెసిఆర్ రూ. 2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. నేడు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఇద్దరు క్రీడాకారిణీలకు నగదు బహుమానం చెక్‌లను సిఎం అందించనున్నారు.