Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ పారా అథ్లెటిక్స్
న్యూఢిల్లీ : భారత పారా అథ్లెట్ వినోద్ కుమార్‌పై రెండేండ్ల నిషేధం విధిస్తూ ప్రపంచ పారా అథ్లెటిక్స్ నిర్ణ యం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో ఎఫ్52 విభాగంలో వినోద్ కుమార్ డిస్కస్ త్రో కాంస్య పతకం సాధించాడు. వినోద్ కుమార్ వైకల్యం ప్రకారం అతడు ఎఫ్52 విభాగం పరిధిలో పోటీపడేందుకు అనర్హుడని పతకాన్ని వెనక్కి తీసుకున్నారు. ఇతర నైపుణ్యాలను ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టినట్టు నిర్ధారించిన బోర్డ్ ఆఫ్ అప్పీల్ ఆఫ్ క్లాసిఫికేషన్ (బీఏసీ) వినోద్‌పై రెండేండ్ల నిషేధం విధించింది. 2023 ఆగట్టు వరకు వినోద్ కుమార్ పారా పోటీల్లో పాల్గొనేందుకు అనర్హుడు.