Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ. 2 కోట్ల చొప్పున చెక్‌లు అందజేత
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ క్రీడా యవనికపై భారత దేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసిన తెలంగాణ క్రీడాకారిణిలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో మూడు స్వర్ణాలు సాధించిన ఇషా సింగ్‌లకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు రూ. 2 కోట్ల చొప్పున నగదు ప్రోత్సాహకాల చెక్‌లు,నివాస స్థలాల పత్రాలను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి అధికారిక నివాసం ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో నిఖత్ జరీన్, ఇషా సింగ్ కుటుంబ సభ్యులతో కలిసి కెసిఆర్ భోజనం చేశారు.