Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2008 ఆస్ట్రేలియన్ ఓపెన్. పురుషుల సింగిల్స్ తొలి సెమీఫైనల్స్. రెండో సీడ్, టైటిల్ ఫేవరేట్ రఫెల్ నాదల్‌పై అన్‌సీడెడ్ జో విల్ఫ్రెడ్ సొంగ అనూహ్య విజయం సాధించింది. స్పెయిన్ బుల్ సెమీఫైనల్ ఓటమితో ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి నిష్క్రమించాడు. రఫెల్ నాదల్ ఓటమితో ఓ బాలుడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్లు ఆ కుర్రాడి కంటతడిని చూపించాయి. ఆ బాలుడే తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో రఫెల్ నాదల్ ప్రత్యర్థి కాస్సర్ రుడ్. ఆ తర్వా కాలంలో ఆ కుర్రాడు స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీలో చేరాడు. రఫెల్ నాదల్ టెన్నిస్ అకాడమీలో శిక్షణ పొందటమే జీవిత లక్ష్యంగా భావించాడు. ఆ కల నెరవేర్చుకున్నాడు.
కెరీర్ 22వ గ్రాండ్‌స్లామ్, ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆల్ టైమ్ రికార్డు 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్కు అతడి శిష్యుడు, తన అకాడమీ కుర్రాడు ఎదురు నిలుస్తున్నాడు. ఎనిమిదో సీడ్, నార్వే సంచలనం కాస్పర్ రుడ్ కెరీర్ తొలి గ్రాండ్‌స్లామ్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తొలి మెగా టైటిల్ వేటలోనే ఆరాధ్య ఆటగాడు, మెంటార్ రఫెల్ నాదల్‌తో తలపడుతున్నాడు. గురు శిష్యుల మధ్య పోరుపై టెన్నిస్ ప్రపంచంలో విపరీత ఆసక్తి నెలకొంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో 13 సార్లు ప్రత్యర్థులకు తలొగ్గని స్పెయిన్ బుల్.. 14వ సారి తన శిష్యుడి ముందు తగ్గుతాడేమో చూడాలి!!.