Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు
నవతెలంగాణ, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర 3వ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం ముగిశాయి. దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటి) క్యాంపస్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన ఫెన్సర్లను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేశారు. రాష్ట్ర జట్టులో నిలిచిన ఫెన్సర్లు ఈ నెలాఖరులో కటక్‌లో జరుగబోయే జాతీయ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించనున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగిన పోటీల్లో మూడు విభాగాల్లో విజేతలుగా నిలిచిన ఫెన్సర్లకు రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కోశాధికారి సందీప్ కుమార్ జాదవ్ అభినందనలు తెలిపారు. ఎస్కే ఇమ్రాన్, శ్రవణ్ కుమార్, బి. శివ, హరీశన్ (సబ్రీ విభాగం).. వి. లోకేశ్, మురళీ, వంశీ, శశాంక్ (ఎప్పీ విభాగం).. తనిష్క్ జాదవ్, ఎస్కే ఎలాన్స్, మణికంఠ, నిఖిలేష్ (ఫాయిల్ విభాగం)లు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు.