Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి : ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) తరహాలో ఆంధ్ర ప్రిమియర్ లీగ్(ఏపిఎల్) టోర్నమెంట్‌ను నిర్వహించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి శరత్‌చంద్రారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా టి20 లోగోతో పాటు టీజర్‌ను సిఎం చేతులమీదుగా సోమవారం ఆవిష్కరించారు. జులై 6నుంచి 17వరకు విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసిఏ విడిసిఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరగనుందన్నారు. జులై 17న జరిగే ఫైనల్‌కు సిఎం జగన్మోహనరెడ్డి హాజరుకానున్నట్లు వారు తెలిపారు. బిసిసిఐనుంచి ఏపిఎల్ టోర్నమెంట్‌కు అనుమతి లభించిందని, ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, సౌరాష్ట్రల్లో ఇలాంటి లీగ్‌లు జరుగుతున్నాయన్నారు. ఏసిఎల్ లీగ్ నిర్వహించడం ద్వారా దేశంలో స్వదేశీ లీగ్ నిర్వహిస్తున్న నాల్గో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుందన్నారు. సిఎంను కలిసిన వారిలో ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఏసిఏ అధ్యక్షులు పి. శరత్‌చంద్రారెడ్డి, కోశాధికారి ఎస్ఆర్ గోపినాథ్ రెడ్డి, సిఇవో ఎంవి శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ టి. సత్యప్రసాద్‌తోపాటు ప్రసాద్, గోపాలరాజు, విష్ణు దంతు తదితరులు ఉన్నారు.