Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్-జార్ఖండ్ రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్స్
బెంగళూరు: జార్ఖండ్‌తో జరుగుతున్న రంజీట్రోఫీ క్వార్టర్‌ఫైనల్-1 మ్యాచ్‌లో బెంగాల్ జట్టు పట్టు బిగించింది. టాస్ ఓడి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన బెంగాల్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 310 పరుగులు చేసింది. అభిషేక్ రామన్(41రిటైర్డ్‌హర్ట్), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(65) కలిసి తొలి వికెట్‌కు 132 పరుగులు జతచేశారు. ఆ తర్వాత సుదీప్(106నాటౌట్), మజుందార్(85) కలిసి మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. జార్ఖండ్ బౌలర్ సుశాంత్ మిశ్రాకు ఒక వికెట్ దక్కింది. కెఎస్‌సిఏ గ్రౌండ్-2లో జార్ఖండ్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ఫైనల్లో ముంబయి జట్టు తొలిరోజు 3 వికెట్ల నష్టానికి 304పరుగులు చేసింది. కెప్టెన్ పృథ్వీ షా(21), జైస్వాల్(35) త్వరగా ఔటైనా.. ఆర్మాన్ జాఫర్(60) అర్ధసెంచరీతో మెరిసాడు. ఆ తర్వాత సువేద్ పర్కార్(104నాటౌట్), సర్ఫరాజ్‌ఖాన్(69) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఉత్తరాఖండ్ బౌలర్ దీపక్ థపోలా(3/53) రాణించాడు.
కర్ణాటక, పంజాబ్ ఢమాల్..
మూడో క్వార్టర్ఫైనల్లో కర్ణాటక జట్టు 213పరుగులకే 7వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఉత్తరప్రదేశ్ బౌలర్లు సౌరభ్ కుమార్(4/67), శివమ్ మావి(30/3) బౌలింగ్‌లో మెరిసారు. మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న నాల్గో క్వార్టర్స్‌ఫైనల్లో పంజాబ్ జట్టు 219 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ అభిషేక్ శర్మ(47), అన్మోల్ప్రీత్ సింగ్(47), సన్వీర్ సింగ్(41) బ్యాటింగ్‌లో రాణించగా.. పునీత్, అనుభవ్‌కు మూడేసి, జైన్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు తొలిరోజు ఆట నిలిచే సమయానికి వికేట్లమీ నష్టపోకుండా 5పరుగులు చేసింది. దూబే(1), హిమాంషు(0) క్రీజ్‌లో ఉన్నారు.