Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటినుంచి ఇండోనేషియా సూపర్ సిరీస్
న్యూఢిల్లీ: ఇండోనేషియా సూపర్ సిరీస్-500 మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. థామస్ కప్‌ను గెలుచుకొని చరిత్ర సృష్టించిన భారత పురుషుల షట్లర్ల బృందం.. ఆ టోర్నీ తర్వాత బరిలోకి దిగుతున్న తొలి ఈవెంట్ ఇదే. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్, మహిళల సింగిల్స్‌లో పివి సింధుపైనే ఆశలున్నాయి. ఇక సైన్వా నెహ్వాల్ రెండోరౌండ్లో మాజీ టాప్‌సీడ్ కరోలినా మారిన్‌తో తలపడనుంది. జులై 28నుంచి కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం కానున్న దృష్ట్యా ఆ టోర్నీకి ముందు జరిగే ఇండోనేషియా టోర్నీలో రాణించాలని ప్రధానంగా దృష్టి నిలిపారు. థామస్‌కప్ ఫైనల్లో 14సార్లు ఛాంపియన్ ఇండోనేషియాను ఓడించి భారత్ తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి రికార్డు నెలకొల్పింది. భారత టాప్ షట్లర్, 9వ సీడ్ లక్ష్యసేన్ తొలిరౌండ్లో 7వ సీడ్, డెన్మార్క్‌కు చెందిన హన్స్ క్రిస్టియన్‌తో తలపడనున్నాడు. ముఖాముఖి పోరులో 0-2తో లక్ష్యసేన్ వెనుకబడి ఉన్నాడు. చివరిసారిగా జరిగిన డెన్మార్క్ ఓపెన్‌లో లక్ష్యసేన్ ప్రి క్వార్టర్స్‌లో ఓటిపాలయ్యాడు. కిదాంబి శ్రీకాంత్ ఈ టోర్నీకి దూరంగా ఉండగా.. పారుపల్లి కశ్యప్, సమీర్ వర్మ, ప్రణరు రారు సింగిల్స్‌లో బరిలోకి దిగుతున్నారు. 37వ సీడ్ కశ్యప్.. తైజు వురు వాంగ్‌తో తలపడనుండగా.. రెండోరౌండ్లో టాప్‌సీడ్ విక్టర్ అక్సెల్సన్ ఎదురుకానున్నాడు. మహిళల సింగిల్స్‌లో పివి సింధు డెన్మార్క్‌కు చెందిన లినే క్రిస్టోఫర్‌తో తలపడనుంది.