Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదోరౌండ్లో కార్ల్‌సన్‌పై గెలుపు
స్టావెంజర్(నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్లో విశ్వనాథన్ ఆనంద్ ఐదోరౌండ్లో విజయం సాధించాడు. సోమవారం జరిగిన ఐదోరౌండ్ పోటీలో ప్రపంచ నంబర్‌వన్ మాగస్ కార్ల్‌సన్‌ను చిత్తుచేశాడు. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంద్ మళ్లీ టాప్‌లోకి దూసుకొచ్చాడు. తొలుత బ్లిట్జ్ ఈవెంట్లోనూ నార్వే సూపర్‌స్టార్ కార్ల్‌సన్‌ను ఆనంద్ ఓడించాడు. ఇక క్లాసికల్ సెక్షన్లో భాగంగా జరిగిన ఆర్మగెడాన్ (సడన్ డెత్ గేమ్)లోనూ ప్రత్యర్థికి ఆనంద్ రాణించాడు. వాస్తవానికి రెగ్యులర్ మ్యాచ్ 40ఎత్తుల వద్ద డ్రాగా ముగిసింది. ఇక ఆర్మగెడాన్ గేమ్‌లో 52 ఏళ్ల ఆనంద్ అద్భుత ఆటతీరుతో కార్ల్‌సన్‌పై గెలుపొందాడు. కేవలం 50ఎత్తుల్లో ఆ విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీంతో ఆనంద్ ఖాతాలో మొత్తం 10పాయింట్లు చేరాయి. మరో నాలుగు రౌండ్లు మిగిలి ఉన్న ఈ టోర్నీలో ఇండియన్ గ్రాండ్‌మాస్టర్ ఆనంద్ ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక కార్ల్సన్ 9.5పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. వెస్లే సో, షక్రియార్ మామెద్యరోవ్లు 8.5పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. నార్వే చెస్ టోర్నీలో క్లాసికల్ గేమ్‌లో మ్యాచ్ డ్రా అయితే ఫలితం కోసం ఆర్మగెడాన్(సడన్ డెత్) మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.