Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గిన 5వ సీడ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఒకే ఏడాదిలో వరుసగా రెండు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను గెలుపొందడం ఇదే ప్రథమం. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను నెగ్గిన నాదల్.. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నెగ్గి 14వ సారి ముద్దాడి కెరీర్లో 22వ గ్రాండ్సామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు టాప్‌సీడ్ జకోవిచ్ దూరంగా ఉండడం అప్పట్లో కలిసిరాగా.. ఈసారి టాప్‌సీడ్ జకోవిచ్‌ను క్వార్టర్ఫైనల్లో ఓడించాడు. గత ఏడాది సెమీస్‌లో జకోవిచ్ చేతిలో ఓడిన నాదల్ ఈసారి క్వార్టర్ఫైనల్లోకి జకోవిచ్‌ను చిత్తుచేయడం విశేషం. దీంతో రికార్డు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన తొలి పురుష టెన్నిస్ ఆటగానిగా రికార్డు నెలకొల్పాడు. నాదల్ తర్వాత రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్‌లు 20 గ్రాండ్‌స్లామ్‌లను కైవసం చేసుకొని ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రికార్డుస్థాయిలో 14వ సారి ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించడంతో రోజర్ ఫెదరర్ కోచ్ ఇవాన్ లుబిసిక్ ట్విటర్ వేదికగా.. రోలాండ్ గారోస్‌లోని ఫిలిప్ చాట్రియర్ కోర్టు పేరుకు నాదల్ పెట్టాలని నిర్వాహకులకు లేఖ రాశాడు.
స్టెఫీగ్రాఫ్ రికార్డు సమం..
కెరీర్లో 22వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన నాదల్.. జర్మనీకి మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీగ్రాఫ్ (22గ్రాండ్‌స్లామ్స్) రికార్డును సమం చేశాడు. మరో రెండు గ్రాండ్‌స్లామ్‌లు గెలిస్తే మార్గరెట్ కోర్ట్ రికార్డుకు చేరుకోనున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ క్రీడాకారిణి మార్గరెట్ కోర్ట్ (24టైటిల్స్) టెన్నిస్ జగత్తులో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు నెగ్గిన క్రీడాకారిణిగా ఉంది. ఆ తర్వాత అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్(23 టైటిల్స్) నిలిచింది. తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గడంతో నాదల్(22), స్టెఫీగ్రాఫ్(22)తో సమానంగా నిలిచాడు. టాప్-3లో ఉన్న ఈ ముగ్గురూ మహిళలే కావడం విశేషం. ఇక పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్ లు నెగ్గిన వారిలో నాదల్ ఇప్పటికే అగ్రస్థానంలో ఉండగా.. ఈ జాబితాలో జకోవిచ్ (20), ఫెదరర్ (20), సంప్రాస్ (14)లు తదుపరి స్థానాల్లో నిలిచారు.