Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాంఛైజీలు కొనుగోలు చేసిన జిఎంఆర్, అదాని
న్యూఢిల్లీ : గ్రామీణ క్రీడ ఖోఖోకు మరింత ఆదరణ రానుంది!. ఖోఖో లీగ్ అల్టిమేట్ ఖోఖోలో కార్పోరేట్ సంస్థలు అడుగుపెట్టాయి. డాబర్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆ సంస్థ చైర్మన్ అమిత్ బర్మన్ ఈ లీగ్‌ను ఆరంభించగా.. తాజాగా జిఎంఆర్, అదాని గ్రూప్‌లు ప్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. జిఎంఆర్ స్పోర్ట్స్ గ్రూప్ తెలంగాణ జట్టును సొంతం చేసుకోగా.. అదాని గ్రూప్ గుజరాత్ జట్టును కొనుగోలు చేసింది. దక్షిణాదిలో ఖోఖో క్రీడకు ఉన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల్లో మంచి పాపులారిటీ ఉన్న ఆటలో ప్రాంఛైజీ కొనుగోలు చేయటం ద్వారా ఆటను మరింత అభివృద్ది చేయవచ్చనే లక్ష్యంతో జిఎంఆర్ గ్రూప్ అల్టిమేట్ ఖోఖో లీగ్‌లో భాగమైందని ఆ సంస్థ తెలిపింది. అల్టిమేట్ ఖోఖో లీగ్ ఇప్పటికే సోనీతో ప్రసార ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.