Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆవరణలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని తిలక్ మార్గ్ దగ్గరున్న యూకో బ్యాంకులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. ఆరు ఫైర్ టెండర్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు ఆవరణలోని తిలక్ మార్గ్ లో ఉన్న ఈ బ్యాంక్ ప్రమాద సమయంలో మూసి ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు ఇంకా నిర్ధారించలేదు. బ్యాంకులో షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే కొన్ని బ్యాంకు డాక్యుమెంట్లు, ఫర్నిచర్ దగ్ధమైనట్లు భావిస్తున్నారు.