Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారా షూటింగ్ ప్రపంచకప్
పారిస్(ఫ్రాన్స్): పారా షూటింగ్ ప్రపంచకప్‌లో అవిని లేఖరా రికార్డు స్వర్ణంతోపాటు 2024 పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన మహిళల 10మీ. ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్-1 విభాగం పోటీలో అవని 250.6పాయింట్లు సాధించి బంగారు పతకాన్ని సాధించింది. దీంతో 20ఏళ్ల అవని ప్రపంచ రికార్డు 249.6పాయింట్లను సవరించడంతోపాటు పారిస్ పారా ఒలింపిక్స్-2024కు అర్హత సాధించింది. ఇదే విభాగంలో పోలెండ్‌కు చెందిన ఎమీలియా బాబ్స్కా(247.6పాయింట్లు) రెండోస్థానం, అన్నా నార్మన్(స్వీడన్) 225.6పాయింట్లు మూడోస్థానంలో నిలిచి రజత, కాంస్య పతకాలను కైసవం చేసుకున్నారు. అంతకుముందు అవని, అతని కోచ్ ఎస్కార్ట్ వీసాలు తిరస్కరించడంతో ఈ పోటీల్లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నా.. సరైన సమయంలో సారు, క్రీడా మంత్రిత్వశాఖ జోక్యం చేసుకొని సమస్యను పరిష్కరించడంతో అవని రికార్డు నెలకొల్పడం విశేషం.