Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాఖపట్నం: విశాఖ పర్యావరణ బ్రాండ్ అంబాసిడర్‌గా భారతజట్టు వికెట్ కీపర్, శ్రీకర్ భరత్ మంగళవారం నియమితులయ్యారు. విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా తీర్చి దిద్దేందుకు ప్రజల అవగాహన కోసం ప్రముఖుల స్ఫూర్తిదాయకమైన సందేశాలు అవసరమని, విశాఖకు పర్యావరణ బ్రాండ్ అంబాసిడర్ కావాలని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ కోరిన మేరకు క్రికెటర్ శ్రీకర్ భారత్‌ను నియమించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను శ్రీకర్ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. విశాఖలో ఈ నెల 5వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించామని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలు అవగాహన పెంచుకోడానికి స్ఫూర్తిదాయకమైన సందేశాలు ఇవ్వాలని శ్రీకర్ భరత్‌ను కోరారు.