Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జకార్తా: ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్-500 అర్హత పోటీల్లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించగా.. టోర్నీనుంచి సైనా నెహ్వాల్, హెచ్ఎస్ ప్రణయ్ రారు, పారుపల్లి కశ్యప్ చివరి నిమిషంలో వైదొలిగారు. మంగళవారం జరిగిన మెయిన్ డ్రా అర్హత పోటీ పురుషుల సింగిల్స్ తొలిరౌండ్ పోటీలో శుభాంకర్ దే 22-20, 10-21, 13-21తో ఆండీ ఫడెల్(ఇండోనేషియా) చేతిలో, గుల్షన్ కుమార్ 16-21, 21-9, 14-21తో సూంగ్ జో(అమెరికా) చేతిలో పరాజయాన్ని చవిచూసారు. మహిళల సింగిల్స్‌లో ఆకర్షీ కశ్యప్ 13-21, 21-9, 21-9తో సిరాడా(థారులాండ్)పై గెలిచింది. ఫిట్నెస్ లేమి, గాయాల కారణంగా సైనా, హెచ్ఎస్ ప్రణరు, పారుపల్లి కశ్యప్ చివరి నిమిషంలో టోర్నీ నుంచి వైదొలిగారు. మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్-పొన్నప్ప జోడీ 17-21, 21-18, 21-14తో కొరియా జోడీపై గెలుపొందగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి, పురుషుల డబుల్స్‌లో అత్రి మను, బి సుమిత్ జోడీ పరాజయాన్ని చవిచూసారు.