Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ
- ద్విశతక ధీరుడు
- రంజీట్రోఫీ నాకౌట్స్
- రెండో ముంబయి బ్యాటర్‌గా సుదేవ్ పార్కర్ రికార్డు
బెంగళూరు: రంజీట్రోఫీ క్వార్ఫైనల్లో ముంబయి మిడిల్ఆర్డర్ బ్యాటర్ సుదేవ్ పార్కర్ డబుల్ సెంచరీకి తోడు, సర్ఫరాజ్ ఖాన్ భారీ శతకంతో రాణించడంతో ఆ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(21), యశస్వి జైశ్వాల్(35)లు త్వరగా ఔటైనా సువేద్ పార్కర్ అద్భుత బ్యాటింగ్‌కు ఆకట్టుకున్నాడు. కెప్టెన్ రహానే స్థానంలో ముంబయి జట్టులో చోటు దక్కించుకున్న పార్కర్ రంజీ ట్రోఫీ అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీతో మెరిసాడు. 447బంతుల్లో 21ఫోర్లు, 4సిక్సర్లతో 252 పరుగులు చేసిన సుదేవ్.. రంజీల్లో ముంబయి తరపున అరంగేట్రం మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన రెండో ఆటగానిగా నిలిచాడు. ఇంతకుముందు ముంబయి ప్రస్తుత కోచ్ అమోల్ మజుందార్ మాత్రమే ఈ ఘనత సాధించాడు. అతడు ముంబయి తరపున 1993-94 రంజీ సీజన్లో హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో 260 పరుగులు సాధించి చరిత్ర నెలకొల్పగా.. తాజాగా ఆ రికార్డును సుదేవ్ సమం చేశాడు. సర్ఫరాజ్ ఖాన్(153పరుగులు; 205బంతుల్లో 14ఫోర్లు, 4సిక్సర్లు) బ్యాటింగ్‌లో రాణించారు. చివర్లో షామ్స్ ములాని 59పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో ముంబయి జట్టు 8 వికెట్ల నష్టానికి 647పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ చేసింది. దీపక్‌కు మూడు వికెట్లు లభించాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది.
క్వార్టర్‌ఫైనల్స్-1(బెంగాల్-జార్ఖండ్)
బెంగాల్: 577/5(సుదీప్ కుమార్ 186; అనుస్తూప్ 117; సుశాంత్ మిశ్రా 2/122)
క్వార్టర్‌ఫైనల్స్-2(ముంబయి-ఉత్తరాఖండ్)
ముంబయి: 647/8డిక్లేర్డ్(సువేద్ పార్కర్ 252, సర్ఫరాజ్ 153; దీపక్ థపోలా 3/89)
ఉత్తరాఖండ్: 39/2(కమల్ సింగ్ 27నాటౌట్; దేశ్‌పాండే 1/13, మోహిత్ అవస్థి 12/2)
క్వార్టర్‌ఫైనల్స్-3(ఉత్తరప్రదేశ్-కర్ణాటక)
ఉత్తరప్రదేశ్ : 155ఆలౌట్(ప్రియమ్ గార్గ్ 39, రింకు సింగ్ 33; శివమ్ మావి 32, మోర్ 2/47)
కర్ణాటక : 100/8(మయాంక్ 22, కృష్ణమూర్తి 15; సౌరభ్ కుమార్ 3/32, అంకిత్ 2/15)
క్వార్టర్ ఫైనల్స్-4(పంజాబ్-మధ్యప్రదేశ్)
పంజాబ్: 219(అభిషేక్ శర్మ 47, అన్మోల్ప్రీత్ 47, సన్వీర్ సింగ్ 41; పునీత్ 3/48, అనుభవ్ 3/40)
మధ్యప్రదేశ్: 238/2(శుభమ్-102నాటౌట్; హిమాంశు 89; మార్కండే 2/70)