Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జాతీయ క్రీడా సమాఖ్యలు కోచ్‌ల వేధింపులను పెడచెవిన పెడుతుండటంతో.. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ (సారు)కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల విదేశీ శిక్షణ శిబిరంలో ఉన్న ఓ మహిళా సైక్లిస్ట్‌పై జాతీయ చీఫ్ కోచ్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి మరువకముందే.. సెయిలింగ్ చీఫ్ కోచ్‌పై ఓ మహిళా సెయిలర్ సారుకి ఫిర్యాదు చేసింది. భారత సెయిలర్ల బృందం ప్రస్తుతం జర్మనీలో శిక్షణ పొందుతుంది. యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన కోచ్ నుంచి వేధింపులు ఎక్కువైతున్నాయని, గతంలో జాతీయ సమాఖ్యకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని మహిళా సెయిలర్ సారుకి చేసిన ఫిర్యాదులో పేర్కొంది. మహిళా సెయిలర్ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన సారు.. జాతీయ సమాఖ్య నుంచి తక్షణమే నివేదిక కోరింది. మహిళా సెయిలర్ సదరు కోచ్‌పై గతంలో చేసిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని కోరింది.