Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో జార్ఖండ్‌పై పైచేయి
బెంగళూర్ : రంజీ ట్రోఫీ సెమీఫైనల్లోకి బెంగాల్ అడుగుపెట్టింది. రంజీ ట్రోఫీ టైటిల్ ఎత్తుకునేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్న బెంగాల్ జట్టు.. మరో సీజన్లో సెమీఫైనల్లోకి చేరుకుంది. జార్ఖండ్‌తో తొలి క్వార్టర్ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పైచేయి సాధించిన బెంగాల్.. సెమీస్ బెర్త్ సొంతం చేసుకుంది. బెంగాల్ జట్టులో టాప్-9 బ్యాటర్లు 50 ప్లస్ ఇన్నింగ్స్‌లు నమోదు చేయటంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 773/7 పరుగుల రికార్డు స్కోరు సాధించిన సంగతి తెలిసిందే. సుధిప్ కుమార్ గర్మాని (186), మజుందార్ (117) సెంచరీలు సాధించగా.. మనోజ్ తివారీ (73), షాబాజ్ అహ్మద్ (78), అభిషేక్ పోరెల్ (68), అభిషేక్ రామన్ (61), అభిమన్యు ఈశ్వరన్ (65), సయన్ మండల్ (53), ఆకాశ్ దీప్ (53) అర్థ సెంచరీలతో కదం తొక్కి దేశవాళీ సర్క్యూట్లో సరికొత్త రికార్డు సృష్టించారు. బెంగాల్ బౌలర్లు సయన్ మండల్ (4/71), షాబాజ్ అహ్మద్ (4/51) మెరవటంతో తొలి ఇన్నింగ్స్‌లో జార్ఖండ్ 298 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో విరాట్ సింగ్ (113), నజీమ్ సిద్దికి (53) రాణించారు. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ రెండో ఇన్నింగ్స్‌లో 318/7తో నిలిచింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి, స్టార్ బ్యాటర్ మనోజ్ తివారి (136, 185 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో బెంగాల్ సెమీఫైనల్స్‌కు చేరుకుంది. రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో మధ్యప్రదేశ్‌తో బెంగాల్ తలపడనుండగా.. ముంబయితో ఉత్తరప్రదేశ్ ఢకొీట్టనుంది.