Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగిల్స్ విజేతలకు తగ్గనున్న మనీ!
లండన్ : మూడేండ్లలో తొలిసారి పూర్తి స్థాయిలో జరుగనున్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకి ప్రైజ్‌మనీ భారీగా పెంచారు. గత ఏడాది వింబుల్డన్ నగదు బహుమతికి 11 శాతం పెంపుతో 40.3 మిలియన్ పౌండ్లు (50.5 మిలియన్ అమెరికన్ డాలర్లు) (రూ.380 కోట్లు) కు చేరింది. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వింబుల్డన్దే అత్యధిక నగదు బహుమతి. దీంతో ఈ ఏడాది పురుషుల, మహిళల సింగిల్స్ విజేతలు రూ.15 కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ సొంతం చేసుకోనున్నారు. ఈ మేరకు ఆల్ ఇంగ్లాండ్ టెన్నిస్ క్లబ్ గురువారం ప్రకటించింది. అయితే, కోవిడ్ మహమ్మారికి ముందు సింగిల్స్ విజేతలు అందుకున్న ప్రైజ్‌మనీతో పోల్చితే ఇది 14.9 శాతం తక్కువ కావటం గమనార్హం. ఓవరాల్ ప్రైజ్‌మనీ పెంచినా.. సింగిల్స్ విజేతలకు అందించే మొత్తం 2019తో పోల్చితే తగ్గింది. ఈ ఏడాది వింబుల్డన్ జూన్ 27 నుంచి జులై 10 వరకు జరుగనుంది.