Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్వెల్త్ ట్రయల్స్ నుంచి నిష్క్రమణ
న్యూఢిల్లీ : ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, మహిళల బాక్సింగ్ దిగ్గజం ఎంసీ మేరీకోమ్ గాయానికి గురైంది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల కోసం భారత బాక్సింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ఇందిరా గాంధీ స్టేడియంలో ట్రయల్స్ జరుగుతున్నాయి. మహిళల 48 కేజీల విభాగంలో ఎంసీ మేరీకోమ్ పోటీపడింది. శుక్రవారం జరిగిన ట్రయల్స్ తొలి రౌండ్లో కాలు గాయానికి గురైన మేరీకోమ్.. బౌట్ మధ్యలోనే నిష్క్రమించింది. 2018 కామన్వెల్త్ క్రీడల పసిడి విజేత, 39 ఏండ్ల మేరీకోమ్ తొలి రౌండ్లోనే పడిపోయింది. అయినా, బౌట్ కొనసాగించింది. కానీ వరుస పంచ్‌లతో ఎడమ కాలు సమన్వయం కోల్పోయింది. పడిపోయిన మేరీకోమ్‌ను రింగ్ నుంచి స్ట్రెచర్‌పై తీసుకెళ్లగా.. హర్యానా బాక్సర్ నితూను రిఫరీ విజేతగా ప్రకటించాడు. మరోవైపు బాక్సింగ్ ప్రపంచ చాంపియన్, తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్ కామన్వెల్త్ గేమ్స్ బెర్త్‌కు పంచ్ దూరంలో నిలిచింది. మహిళల 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ 7-0తో ఏకపక్ష విజయంతో ఫైనల్లోకి ప్రవేశించింది. నేడు తుది పోరులో హర్యానా బాక్సర్ మీనాక్షితో నిఖత్ జరీన్ తలపడనుంది.