Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జీపీబిఎల్ ఆటగాళ్ల వేలం
బెంగళూర్ : ప్రతిభావంతులైన దేశవాళీ యువ బ్యాడ్మింటన్ క్రీడాకారుల కోసం గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ లీగ్ (జీపీబిఎల్) గొప్ప అవకాశం ముందుకు తీసుకొచ్చింది!. భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారులు మెంటార్లుగా కొనసాగుతున్న ఎనిమిది ప్రాంఛైజీల లీగ్ ఆటగాళ్ల వేలం నేడు జరుగనుంది. ఆటగాళ్ల వేలంలో సుమారు 200 మంది ఆటగాళ్లు నిలిచారు. బెంగళూర్ లయన్స్, మంగళూర్ షార్క్స్, మాండ్య బుల్స్, మైసూర్ పాంథర్స్, మాలాండ్ ఫాల్కాన్స్, బండిపూర్ టస్కర్స్, కెజిఎఫ్ వూల్ఫ్స్, కొడుగు టైగర్స్ ప్రాంఛైజీలు నేడు షట్లర్ల కోసం వేలం పాట పాడనున్నాయి. ప్రతి జట్టులో గరిష్టంగా ఎనిమిది ఉంటారు. ఓ ఐకాన్ ఆటగాడు, ఇద్దరు టైర్-1, టైర్-2 షట్లర్లు, ఇద్దరు మహిళా షట్లర్లు తప్పనిసరిగా ఉండాలి. కిదాంబి శ్రీకాంత్, సాయిప్రణీత్, అశ్విని పొన్నప్ప, చిరాగ్‌శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకీరెడ్డి, హెచ్ఎస్ ప్రణరు, పి.వి సింధు, జ్వాల గుత్తలు ఎనిమిది ప్రాంఛైజీలుగా సలహాదారులుగా వ్యవహరించనున్నారు. ఆటగాళ్ల వేలంలో ప్రతి ప్రాంఛైజీ గరిష్టంగా రూ.12 లక్షలు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంది.