Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖేలో ఇండియా క్రీడల్లో స్విమ్మర్ జోరు
పంచకుల్ (హర్యానా) : ఖేలో ఇండియా క్రీడల్లో తెలంగాణ స్విమ్మర్ వృట్టి అగర్వాల్ జోరు కొనసాగుతోంది. హర్యానాలోని పంచకుల్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక దేశవాళీ క్రీడల్లో రెండో పసిడి పతకం సొంతం చేసుకుంది. మహిళల 1500 మీటర్ల ప్రీ స్టయిల్ విభాగంలో ఖేలో ఇండియా క్రీడల రికార్డుతో అగర్వాల్ బంగారు పతకం సాధించింది. ఖేలో ఇండియా క్రీడల్లో రికార్డు 18;01;45 టైమింగ్‌తో ఈదేసింది. రెండో పసిడి పతకం సాధించిన వృట్టి అగర్వాల్‌ను రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అభినందించారు. ఖేలో ఇండియా క్రీడల వేదిక పంచకుల్కు చేరుకున్న అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి శనివారం తెలంగాణ బాక్సర్ మహ్మద్ బిలాల్ సెమీఫైనల్ బౌట్‌కు వీక్షించారు. సెమీస్‌లో 4-1తో గెలుపొందిన బిలాల్‌కు ఫైనల్స్‌కు శుభాకాంక్షలు తెలిపారు.