Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : వెయిట్‌లిఫ్టింగ్ యూత్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భారత లిఫ్టర్లు రాణించారు. మెక్సికోలోని లియోన్ నగరంలో జరుగుతున్న ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు రెండు సిల్వర్ మెడల్స్ దక్కాయి. ఆకాంక్ష కిశోర్ 40 కేజీల విభాగంలో రజత పతకం సాధించగా.. విజరు ప్రజాపతి 49 కేజీల విభాగంలో సిల్వర్ సొంతం చేసుకున్నాడు. పోటీల తొలి రోజు రెండు పతకాలు వశపర్చుకున్న భారత్.. టోర్నీకి ఘనంగా మొదలెట్టింది. మహిళల 40 కేజీల విభాగంలో ఆకాంక్ష 127 కేజీల బరువు ఎత్తిపడేసింది. స్నాచ్‌లో 59 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 68 కేజీలు ఎత్తింది. పురుషుల 49 కేజీల విభాగంలో విజరు ప్రజాపతి 175 కేజీలు ఎత్తాడు. స్నాచ్‌లో 78 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 97 కేజీల బరువు అలవోకగా ఎత్తి రజత పతకం అందుకున్నాడు.