Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ ఊహించినట్టుగానే ఐర్లాండ్‌లో భారత జట్టు పర్యటనకు చీఫ్ కోచ్‌గా వెళ్లనున్నాడు. ఎన్ఏసీ ఇతర కోచ్‌లు కొటక్, సాయిరాజ్, మునిశ్ బాలిలు సహాయక బృందంలో భాగం కానున్నారు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో భారత్ రెండు టీ20లు ఆడనుంది. ఈ సిరీస్ సమయంలోనే టీమ్ ఇండియా పటౌడీ ట్రోఫీలో చివరి టెస్టు నాటింగ్‌హామ్‌లో ఆడాల్సి ఉంది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్టు జట్టుతో ఉండనుండగా.. టీ20 జట్టుతో వీవీఎస్ లక్ష్మణ్ వెళ్లనున్నాడు. బాలి, కొటక్, సాయిరాజ్ త్రయం ఇప్పటికే సఫారీతో సిరీస్‌కు భారత జట్టుతో కలిసి ఉన్నారు. జూన్ 15న భారత జట్లు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనున్నాయి. ఇదిలా ఉండగా మాజీ క్రికెటర్లు, విశ్రాంత అంపైర్ల పెన్షన్లను బీసీసీఐ భారీగా పెంచింది. 100 శాతం నుంచి 30 శాతం వరకు పెన్షన్లను పెంచినట్టు ఓ ప్రకటనలో తెలిపింది.