Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈ వేలంలో ఐపీఎల్ మీడియా హక్కులకు రికార్డు ధర
- టెలివిజన్‌కు రూ.57.5 కోట్లు, డిజిటల్‌కు రూ.50 కోట్లు
- నేడూ కొనసాగనున్న ఐపీఎల్ వేలం పాట
నవతెలంగాణ-ముంబయి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కనీవినీ ఎరుగుని రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలో రెండో విలువైన స్పోర్ట్స్ లీగ్‌గా అవతరించింది. 2023-27 ఐపీఎల్ సీజన్లకు జరుగుతున్న ఈ వేలంలో భారత్‌లో టెలివిజన్, డిజిటల్ ప్రసారాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై కాసుల వర్షం కురిసింది. రానున్న ఐపీఎల్ సీజన్లలో ప్రతి మ్యాచ్‌కు రూ.107.5 కోట్ల ఆదాయం ఆర్జించనుంది. టెలివిజన్ ప్రసార హక్కులకు రూ.57.5 కోట్లు, డిజిటల్ ప్రసార హక్కులకు రూ.50 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరనున్నాయి. గత ఐదేండ్ల మీడియా హక్కుల ఒప్పందం రూపంలో బీసీసీఐ ఆర్జించిన ఆదాయానికి రెట్టింపు సొంతం చేసుకుంది. ఈ వేలంలో ఇంకా రెండు ప్యాకేజీలు మిగిలి ఉండటంతో మీడియా హక్కుల విలువ రూ.50 వేల కోట్ల మార్క్ తాకేందుకు అవకాశం కనిపిస్తోంది.
సోమవారం ఏడు గంటల పాటు ఉత్కంఠగా సాగిన ఈ వేలంలో నలుగురు పోటీదారులు గట్టిగా ప్రయత్నించారు. మార్కెట్ వర్గాలు, ఈ వేలంలో పోటీపడుతున్న సంస్థల ప్రతినిధులు చెబుతున్న వివరాల ప్రకారం ప్రస్తుత ఐపీఎల్ ప్రసారదారు డిస్నీ స్టార్ సంస్థ డిజిటల్ ప్రసార హక్కులు కోల్పోయినట్టు తెలుస్తోంది. డిస్నీ స్టార్‌తో పాటు రిలయన్స్ వయాకామ్18, సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్, జీ ఎంటర్టైన్మెంట్స్లు ఈ వేలంలో పోటీపడ్డాయి. ఐపీఎల్ టెలివిజన్ పసార హక్కులను ప్రస్తుత ప్రసారదారు డిస్నీస్టార్ సంస్థ రూ.57.50 కోట్ల రికార్డు ధరకు దక్కించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రిలయన్స్ వయాకామ్18 సంస్థ రూ.50 కోట్లకు డిజిటల్ ప్రసార హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్లో ప్రస్తుతం సీజన్‌కు 74 మ్యాచులు జరుగుతున్నాయి. ఆ ప్రకారం ఐదేండ్లకు 370 మ్యాచులు జరుగుతాయి. దీంతో ప్రతి మ్యాచ్‌కు రూ.107.5 కోట్ల ధరతో రూ.39,775 కోట్లకు భారత్‌లో టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. అయితే, 2024 సీజన్ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 84 మ్యాచులు (మొత్తం మ్యాచులు 410) జరిగే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు అంటున్నాయి. ఈ లెక్కన, రూ.44,075 కోట్లకు ఐపీఎల్ మీడియా హక్కులు అమ్ముడయ్యాయి. ఈ వేలానికి ముందు టెలివిజన్ ప్రసారాలకు మ్యాచ్‌కు కనీస ధర రూ.49 కోట్లు, డిజిటల్ ప్రసారాలకు ప్రతి మ్యాచ్‌కు రూ.33 కోట్లుగా నిర్ణయించారు. టెలివిజన్ హక్కులు గత సీజన్‌తో పోల్చితే ఓ మోస్తరు పెరుగుదల సాధించగా.. డిజిటల్ ప్రసారాల విలువ అమాంతం ఆకాశానికి చేరుకుంది. భారత్‌లో డిజిటల్ వీక్షకుల పెరుగుదలతో ఐపీఎల్ డిజిటల్ ప్రసార హక్కులకు రెక్కలొచ్చాయి. ఇక అంతిమంగా, ఈ విలువ ప్రభావం టెలివిజన్, డిజిటల్ వీక్షకులపై పడనుంది. మ్యాచ్ ప్రసారాల కోసం సబ్స్క్రిప్షన్ ధరలో గణనీయంగా పెరుగుదల ఉండవచ్చు!.
మరోవైపు, ప్యాకేజీ-సి కోసం సోమవారమే పోటీ మొదలైంది. ప్యాకేజీ-సిలో నాన్ ఎక్స్‌క్లూజివ్ మ్యాచులు 18 ఉన్నాయి. సీజన్ ఆరంభ మ్యాచ్, ప్లే ఆఫ్స్ మ్యాచులు సహా ఫైనల్ ఇందులో ఉంటాయి. వీటికి తోడు సీజన్లో సాయంత్రం జరిగే మ్యాచులు జోడించారు. సీజన్లో ఓవరాల్‌గా పది మ్యాచులు పెరిగితే.. ఈ ప్యాకేజీలో రెండు మ్యాచులు అదనంగా జోడిస్తారు. ప్రస్తుతం ప్యాకేజీ-సి విలువ రూ.2 వేల కోట్లుగా ఉన్నట్టు సమాచారం. నేడు ప్యాకేజీ-సితో పాటు ప్యాకేజీ-డి (రెస్ట్ ఆఫ్ ది వరల్డ్) ఈ వేలం జరుగనుంది. చివరి రెండు ప్యాకేజీ ఈ వేలం ముగిసిన అనంతరం పూర్తి వివరాలను బీసీసీఐ వెల్లడించనుంది. ప్రస్తుతానికి ప్యాకేజీ-ఏ, ప్యాకేజీ-బి ఎవరు నెగ్గారు, ఏ ధరకు అనేది బీసీసీఐ నుంచి అధికారిక సమాచారం లేదు.
ప్యాకేజీ-ఏ
ప్రతి మ్యాచ్‌కు- రూ.57.5 కోట్లు
ఐదేండ్లకు - రూ. 21,275 కోట్లు
ప్యాకేజీ-బి
ప్రతి మ్యాచ్‌కు - రూ.50 కోట్లు
ఐదేండ్లకు - రూ.18,500 కోట్లు
(సీజన్‌కు 74 మ్యాచులు,
ఐదేండ్లలో 370 మ్యాచులు)