Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా హార్దిక్
ముంబయి: ఇంగ్లండ్‌తో జరిగే ఏకైక టెస్ట్ మ్యాచ్‌కు టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీలతో కూడిన భారత జట్టు నేడు (గురువారం) లండన్‌కు బయల్దేరాల్సి ఉంది. అయితే ఆ బృందంతో పాటు కేఎల్ రాహుల్ ప్రయాణించడం అనుమానమేనని బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు. స్వదేశంలో దక్షిణా ఫ్రికాతో జరుగుతున్న టి20 సిరీస్‌కు ముందు గాయపడ్డ రాహుల్ ఇంకా కోలు కోలేదని సమాచారం. రాహుల్ సహచర సభ్యులతో నేడు ఇంగ్లండ్‌కు బయల్దేరాల్సి ఉన్నా.. అతను బెంగళూరులోని ఎన్సిఏ(జాతీయ క్రికెట్ అకాడమీ)లోనే ఉండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఐర్లాండ్‌తో టి20 సిరీస్‌కు కెప్టెన్ హార్దిక్
ఐర్లాండ్‌తో జరిగే రెండు టి20ల సిరీస్‌కు కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా వ్యవహరించ నున్నాడు. దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్‌లో కెప్టెన్‌గా ఉన్న పంత్ నిరాశపరచడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆ పర్యటనకు ఇద్దరు వికెట్ కీపర్లు ఇషాంత్, దినేశ్ కార్తీక్ ఉండనున్నారని, పంత్‌కు ఈ పర్యటనకు విశ్రాంతి కల్పించనున్నట్లు సమాచారం. ఆ పర్యటనకు మొహిసిన్ ఖాన్, రాహుల్ త్రిపాఠితోపాటు సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్, దినేశ్ కార్తీక్, హార్దిక్ చోటు దక్కనున్నట్లు తెలిసింది.