Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీకాంత్ ఔట్.. ొ ఇండోనేషియా ఓపెన్
జకార్తా: ఇండోనేషియా ఓపెన్ పురుషుల సింగిల్స్ రెండోరౌండ్లోకి హెచ్ఎస్ ప్రణరు, సమీర్ వర్మ రెండోరౌండ్లోకి ప్రవేశించగా.. కిదాంబి శ్రీకాంత్ అనూహ్యంగా తొలిరౌండ్లోనే ఓటమిపాలయ్యాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్ పోటీలో సమీర్ 21-19, 21-15తో థామస్(ఫ్రాన్స్)ను ఓడించాడు. రెండోరౌండ్లో సమీర్ అమెరికాకు చెందిన 6వ సీడ్ లీ-జిల్-జియాతో తలపడనున్నాడు. ఇక ప్రణరు 21-10, 21-9తో భారత్‌కే చెందిన యువ షట్లర్, 8వ సీడ్ లక్ష్యసేన్‌ను ఓడించాడు. రెండోరౌండ్లో ప్రణరు హాంకాంగ్‌కు చెందిన లాంగ్ అంగస్‌తో తలపడనున్నాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ 21-23, 10-21తో లెవెర్డెజ్(ఫ్రాన్స్) చేతిలో వరుససెట్లలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్-ధృవ్ కపిల జోడీ 27-25, 18-21, 21-19తో కొరియాకు చెందిన మట్సుయి-యషినోరీపై పోరాడి గెలుపొందగా.. మహిళల డబుల్స్‌లో అశ్విని-శిఖా జోడీ 9-21, 10-21తో చైనా జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.