Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫుట్‌బాల్ షెడ్యూల్ విడుదల
- మూడు వేదికల్లో 16జట్ల మధ్య 32 మ్యాచ్‌లు
- సెమీఫైనల్స్‌కు గోవా, ఫైనల్‌కు ముంబయి ఆతిథ్యం
రోమ్: 7వ ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 11నుంచి భారత్‌లోని మూడు వేదికల్లో ఫిఫా ప్రపంచకప్ సంగ్రామం జరగనుంది. కలింగ స్టేడియం(భువనేశ్వర్), పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(గోవా), డివై పాటిల్ స్టేడియం(నవీ ముంబయి) లలో ఈ టోర్నీ మ్యాచ్‌లు జరగ నున్నాయి. 16జట్లు టైటిల్కోసం పోటీపడనుండగా.. 16జట్లను నాలుగు గ్రూపులుగా విభజించనున్నారు. మొత్తం 32మ్యాచ్‌లు జరగనుండగా.. ప్రతి వేదికలో 10మ్యాచ్‌లు జరగనున్నాయి. నాలుగు గ్రూపుల్లోని 16జట్లు ఆయా గ్రూప్‌లోని మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. ఆతిథ్య హోదాలో భారత్ నేరుగా ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. గ్రూప్-ఏలో ఉన్న భారత్ మిగతా మూడు జట్లతో భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంతో తలపడనుంది. జూన్ 24న ట్రోఫీ ఆవిష్కరణతోపాటు జట్ల పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది. రెండు క్వార్టర్‌ఫైనల్ పోటీలు నవీ ముంబయి, మరో రెండు క్వార్టర్‌ఫైనల్ పోటీలు గోవాలో జరగనున్నాయి. సెమీస్‌కు పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(గోవా), ఫైనల్‌కు నవీ ముంబయిలోని డివై పాటిల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 21, 22న క్వార్టర్‌ఫైనల్స్, 26 సెమీస్, 30న ఫైనల్ పోటీ జరగనున్నాయి.