Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఫిన్లాండ్లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్‌లో ఈటెను 89.30 మీటర్ల దూరం విసిరి రజత పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ ఈవెంట్లో ఫిన్లాండ్కు చెందిన ఆలివర్ హెలాండర్ 89.83 మీటర్లు విసిరి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నారు. త్వరలో 90 మీటర్ల క్లబ్లో చేరాలనుకుంటున్నానని నీరజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో 2021, ఆగస్టు 7న జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్‌లో నీరజ్ చోప్రా ఈటెను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో అథ్లెటిక్స్ విభాగంలో తొలి స్వర్ణం సాధించిన ఆటగాడిగా.. వ్యక్తిగతంగా ఒలింపిక్స్‌లో దేశానికి స్వర్ణం అందించిన రెండో ఆటగాడిగా నీరజ్ చోప్రా చరిత్ర సష్టించాడు. గతేడాది మార్చిలో పాటియాలాలో జరిగిన జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఈటెను 88.07 మీటర్ల దూరం విసిరాడు.