Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు: రంజీట్రోఫీ సెమీఫైనల్లో ముంబయి పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 393పరుగులకు ఆలౌటైన ముంబయి.. రెండోరోజు ఉత్తరప్రదేశ్‌ను కట్టడి చేసింది. బుధవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ముంబయి జట్టు 393పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హార్దిక్ టమోర్(115), శామ్స్ ములానీ(50) అర్ధసెంచరీలతో రాణించారు. కరణ్ శర్మకు నాలుగు, సౌరభ్ కుమార్‌కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన యుపిని ముంబయి బౌలర్లు కట్టడి చేశారు. ఆట ముగిసే సమయానికి యుపి జట్టు రెండు వికెట్లు నష్టపోయి 25 పరుగులు చేసింది. సమర్థ్(0), ప్రియమ్ గార్గ్(3) ఔట్ కాగా.. మాధవ్(11), కరణ్ శర్మ(10) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు
పోరాడుతున్న బెంగాల్..
రెండో సెమీస్‌లో బెంగాల్ జట్టు పోరాడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్‌ను 341 పరుగులకే కట్టడి చేసినా.. అనంతరం బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆరంభించి 54పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో బెంగాల్ మంత్రి మనోజ్ తివారి(84నాటౌట్), షాబాజ్ అహ్మద్(72నాటౌట్) కలిసి 6వ వికెట్‌కు 143పరుగులు జతచేసి ఆదుకున్నారు. రెండోరోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ జట్టు 5వికెట్లు కోల్పోయి 197పరుగులు చేసింది. అంతకుముందు మధ్యప్రదేశ్ జట్టులో హిమాంషు(165), అక్షత్(63) రాణించడంతో ఆ జట్టు 341పరుగుల స్కోర్‌ను నమోదు చేయగల్గింది. ముఖేస్కుమార్కు నాలుగు, షాబాజ్ అహ్మద్‌కు మూడు వికెట్లు దక్కాయి.