Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 37మందితో కామన్వెల్త్ గేమ్స్‌కు భారత బృందం
న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్‌కు భారత బృందానికి సారథిగా నీరజ్ చోప్రా ఎంపికయ్యాడు. 37మంది సభ్యుల భారత అథ్లెటిక్ జట్టుకు సారథిగా నీరజ్‌ను ఎంపిక చేసినట్టు సెలెక్షన్ కమిటీ ఆఫ్ ఎఎఫ్ఐ గురువారం ప్రకటించింది. హిమ దాస్, ద్యూతీ చంద్ 4×400మీ. రిలేలో మాత్రమే పాల్గొంటారని ఆ ప్రకటనలో పేర్కొంది. అలాగే ఆవేశ్ సేబాల్ 3వేల మీ. స్టీపుల్ ఛేజ్ జాతీయ రికార్డు హౌల్డర్తోపాటు జ్యోతి యర్రాజి 100మీ. హర్డిల్స్‌లో ప్రాతినిధ్యం వహించనున్నారు. కామన్వెల్త్స గేమ్స్ జులై 28నుంచి ఆగస్టు 8వరకు జరగనున్నాయి.
జట్లు..: పురుషులు: అవినాశ్ సేబల్(3వేల మీ. స్టీపుల్ ఛేజ్), నితేందర్ రావత్(మారథాన్), శ్రీశంకరన్, మహ్మద్ అనీస్(లాంగ్‌జంప్), అబ్దుల్లా అబూబకర్, ప్రవీన్ ఛిత్రవెల్, ఎల్డోస్ పాల్(ట్రిపుల్ జంప్), తేజిందర్ పాల్ సింగ్(షాట్‌పుట్), నీరజ్ చోప్రా, డిపి మను, రోహిత్ యాదవ్(జావెలిన్ త్రో), సందీప్ కుమార్, అమిత్ ఖత్రీ(రేస్ వాకింగ్), అమోజ్ జాకోబ్, నిర్మల్ థోమ్, అరోకియా రాజీవ్, మహ్మద్ అజ్మల్, నాగనాథన్ పండి, రాజేశ్ రమేశ్(4×400మీ. రిలే).
మహిళలు: ధనలక్ష్మి(100మీ, 4×400మీ. రిలే), జ్యోతి యర్రాజి(100మీ. హర్డిల్స్), ఐశ్వర్య(లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్), అన్సీ సాజన్(లాంగ్ జంప్), మన్‌ప్రీత్ కౌర్(షాట్‌పుట్), నవ్‌జీత్ కౌర్, సీమ అంతిల్(డిస్కస్ త్రో), అన్నురాణి, శిల్పా రాణి(జావెలిన్ త్రో), మంజుబాల సింగ్, సరితా(హ్యామర్ త్రో), భావ్నా జాత్, ప్రయాంక(రేస్ వాకింగ్), హిమదాస్, ద్యూతీ చంద్, షర్బానీ నందా, ఎంవి జిల్నా, ఎన్ఎస్ సిని(4×100మీ. రిలే).