Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంజీట్రోఫీ సెమీఫైనల్స్
బెంగళూరు: రంజీట్రోఫీ సెమీఫైనల్లో ముంబయి జట్టు భారీ ఆధిక్యతను సంపాదించింది. ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న సెమీస్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 213పరుగుల ఆధిక్యతను సంపాదించిన ముంబయి.. శుక్రవారం రెండో ఇన్నింగ్స్‌లో 4వికెట్ల నష్టానికి 449 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. దీంతో ఆ జట్టుకు ఇప్పటికే 662పరుగుల ఆధిక్యత లభించింది. యశస్వి జైస్వాల్(181), ఆర్మాన్ జాఫర్(127) సెంచరీలతో కదం తొక్కారు. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి సర్ఫరాజ్(23), ములాని(10) క్రీజ్‌లో ఉన్నారు. యుపి తరఫున 9మంది బౌలర్లు బౌలింగ్ చేయడం విశేషం. ప్రిన్స్‌కు రెండు, సౌరభ్, శివమ్ మావికి తలా ఒక వికెట్ లభించాయి.
ఓటమి దిశగా బెంగాల్
ఆలూరు వేదికగా జరుగుతున్న మరో సెమీస్ పోటీలో బెంగాల్ జట్టు ఓటమి కోరల్లో నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ జట్టు 281 పరుగులకు ఆలౌట్ కావడంతో బెంగాల్ జట్టు 350పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చింది. నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి బెంగాల్ జట్టు 4వికెట్లు కోల్పోయి 96పరుగులు చేసింది. విజయానికి మరో 254 పరుగులు చేయాల్సిన బెంగాల్ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(52నాటౌట్), మజుందార్(8) క్రీజ్‌లో ఉన్నారు. అభిషేక్(0), సుదీప్(19), పోరెల్(7), మనోజ్ తివారి(7) ఔటయ్యారు. నేటితో రంజీట్రోఫీ సెమీఫైనల్స్ పోటీలు ముగియనున్నాయి.