Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోనేషియా ఓపెన్
జకార్తా: ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి హెచ్ఎస్ ప్రణయ్ రారు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్లో ప్రణరు 21-14, 21-12తో రస్మస్ జెంకే(డెన్మార్క్)పై వరుససెట్లలో గెలిచాడు. దీంతో ఇరువురు ముఖాముఖి పోటీలో 2-2తో సమం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ను ప్రణరు కేవలం 42నిమిషాల్లోనే ముగించాడు. ఇండోనేషియా ఓపెన్‌లో మిగిలిన ఏకైక భారత షట్లర్ ప్రణయ్ మాత్రమే. శనివారం జరిగే సెమీస్‌లో ప్రణరు.. చైనాకు చెందిన ఝా-జున్-పెంగ్‌తో తలపడనున్నాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ 23వ స్థానంలో ఉండగా.. ఝా-జున్ 35వ ర్యాంక్‌లో ఉన్నాడు.