Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 27 బంతుల్లో 55 పరుగులు
- హార్దిక్ పాండ్యా మెరుపులు
రాజ్‌కోట్: సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అర్ధసెంచరీకి తోడు హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్ తోడవ్వడంతో నాల్గో టి20లో టీమిండియా గౌరవప్రద స్కోర్ చేసింది. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన దినేశ్ కార్తీక్ 27బంతుల్లోనే 55పరుగులు చేశాడు. దినేశ్ ఇన్నింగ్స్‌లో 9ఫోర్లు, 2సిక్సులున్నాయి. కార్తీక్‌కు తోడు హార్దిక్ పాండ్యా (46; 31బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) కూడా ధాటిగా ఆడడంతో టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 169పరుగులు చేసింది. వరుసగా నాల్గో మ్యాచ్‌లోనూ టీమిండియా కెప్టెన్ టాస్ ఓడిపోయాడు. ఆరంభంలోనే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(5) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ ఎప్పట్లాగానే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. కిషన్ 26బంతుల్లో 27పరుగులు చేసి నోర్ట్జే బౌలింగ్‌లో వెనుదిరిగాడు. వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్(4) నిరాశపరిచాడు. కెప్టెన్ రిషబ్ పంత్ కూడా తన పేలవ ఫామ్ కొనసాగిస్తూ 17 పరుగులు చేసి కేశవ్ మహరాజ్‌కు వికెట్ అప్పగించాడు. ఆ తర్వాత, హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ జోడీ సఫారీలపై విరుచుకుపడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎన్గిడికి రెండు, జాన్సన్, ప్రిటోరియస్, నోర్ట్జే, కేశవ్ మహరాజ్‌లకు తలా ఒక వికెట్ లభించాయి.
స్కోర్‌బోర్డు..
ఇండియా ఇన్నింగ్స్: గైక్వాడ్ (సి)డికాక్ (బి)ఎన్గిడి 5, ఇషాన్ కిషన్ (సి)డికాక్ (బి)నోర్ట్జే 27, శ్రేయస్ (ఎల్బి) జాన్సన్ 4, రిషబ్ పంత్ (సి)ప్రెటోరియస్ (బి)మహరాజ్ 17, హార్దిక్ (సి)షాంసీ (బి)ఎన్గిడి 46, దినేశ్ కార్తీక్ (సి)డుస్సెన్ (బి)ప్రెటోరియస్ 55, అక్షర్ పటేల్ (నాటౌట్) 8, హర్షల్ పటేల్ (నాటౌట్) 1, అదనం 6. (20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి) 169పరుగులు.
వికెట్ల పతనం: 1/13, 2/24, 3/40, 4/81, 5/146, 6/159
బౌలింగ్: జాన్సన్ 4-0-38-1, ఎన్గిడి 3-0-20-2, ప్రెటోరియస్ 4-0-41-1, నోర్ట్జే 3-0-21-1, షాంసీ 2-0-18-0, మహరాజ్ 4-0-29-1.