Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాల్ట్, మలన్, బట్లర్ సెంచరీలు
- లివింగ్ స్టోన్ మెరుపు ఇన్నింగ్స్
ఆమ్స్టెల్వీన్(నెదర్లాండ్స్):
వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి మరోసారి ఇంగ్లండ్ జట్టు తన రికార్డును తానే బ్రేక్ చేసింది. 2018లో ఆస్ట్రేలియాపై 481పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు.. తాజాగా నెదర్లాండ్స్‌పై 50 ఓవర్లలో 498పరుగులు చేసి ఆ రికార్డును చెరిపేసింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నెదర్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టు శుక్రవారం జరిగిన తొలి వన్డేలో తొలిగా బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 50 ఓవర్లలో 4వికెట్లు నష్టపోయి 498పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనర్ బట్లర్(1) నిరాశపర్చినా.. సాల్ట్(122; 93బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు), మలన్(125; 109బంతుల్లో, 9ఫోర్లు, 3సిక్సర్లు), బట్లర్(162నాటౌట్; 70బంతుల్లో 7ఫోర్లు, 14సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొత్తమ్మీద 26సిక్సర్లు, 34ఫోర్లు నమోదయ్యాయి. చివర్లో లివింగ్‌స్టోన్(66నాటౌట్), 22బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడడు. సాల్ట్, మలన్ కలిసి 2వ వికెట్‌కు 222పరుగులు, మలన్-బట్లర్ కలిసి 3 వికెట్‌కు 184పరుగులు జతచేశారు. 30ఓవర్లు పూర్తయ్యేసరికి 2వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసిన ఇంగ్లండ్.. చివరి 20 ఓవర్లలో 274పరుగులు చేయడం గమనార్హం. నెదర్లాండ్స్ బౌలర్లలో ఫిలిప్పే 10ఓవర్లలో 108, స్నాటర్ 10ఓవర్లలో 99పరుగులు సమర్పించుకొన్నారు.
స్కోర్‌బోర్డు...
ఇంగ్లండ్ ఇన్నింగ్స్: జాసన్ రారు (బి)స్నాంటర్ 1, సాల్ట్ (సి)బెయిసెవిన్ (బి)బ్రీక్ 122, మలన్ (సి)బెస్ (బి)సీలార్ 125, బట్లర్ (నాటౌట్) 162, మోర్గాన్ (ఎల్బి)సీలార్ 0, లివింగ్‌స్టోన్ (నాటౌట్) 66, అదనం 22. (50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 498పరుగులు.
వికెట్ల పతనం: 1/1, 2/223, 3/407, 4/407
బౌలింగ్: బీక్ 10-0-82-1, స్నాంటర్ 10-0-99-1, సీలార్ 9-0-83-2, లీడే 5-0-65-0, బోసెవిలిన్ 10-0-108-0, దత్ 6-0-55-0