Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్
- చాంపియన్‌షిప్ ఏర్పాట్లపై తలేబ్
హైదరాబాద్ : 24వ ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ (మెన్) చాంపియన్‌షిప్స్‌కు ప్రపంచ శ్రేణి సదుపాయాలతో ఏర్పాట్లు చేయటం బాగుందని ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య టెక్నికల్ కమిటీ సభ్యుడు మహ్మద్ తలేబ్ కితాబిచ్చారు. ఈ నెల 22 నుంచి 30 వరకు గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. ప్రతిష్టాత్మక టోర్నీకి భారత్ తొలిసారి ఆతిథ్యం ఇస్తోంది. ఎనిమిది దేశాల నుంచి ఎనిమిది క్లబ్‌లు పోటీపడుతున్న ఈ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన జట్టు నేరుగా అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య నిర్వహించే ఐఎఫ్హెచ్ సూపర్ గ్లోబ్ టోర్నమెంట్‌కు అర్హత సాధించనుంది. భారత హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావుతో కలిసి మహ్మద్ తలేబ్ సోమవారం గచ్చిబౌలి స్టేడియం సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. 'ఆసియా క్లబ్ లీగ్ హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు ఏర్పాట్లు బాగున్నాయి. ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో స్టేడియం సిద్ధం చేశారు. ఆసియా క్లబ్ లీగ్ చాంపియన్‌షిప్ చరిత్రలోనే ఈ టోర్నీ ప్రత్యేకంగా నిలుస్తుందనే నమ్మకం కలిగింది' అని మహ్మద్ తలేబ్ అన్నారు.