Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లకు తప్పని నిరాశ
- ముగిసిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్స్
బెంగళూర్ : ముంబయి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. ఉత్తరప్రదేశ్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యతతో మాజీ చాంపియన్ ముందంజ వేసింది. ముంబయి బ్యాటర్ యశస్వి జైస్వాల్ వరుస ఇన్నింగ్స్‌ల్లో 100, 181 పరుగుల శతక ఇన్నింగ్స్‌లతో చెలరేగాడు. జైస్వాల్ జోరుతో ముంబయి తొలి ఇన్నింగ్స్‌లో 393, రెండో ఇన్నింగ్స్‌లో 533 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే కుప్పకూలిన ఉత్తరప్రదేశ్ భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సమర్పించుకుంది. మరోవైపు రంజీ ట్రోఫీ ముద్దాడాలనే బలీయమైన కాంక్షతో నాకౌట్ దశలోకి అడుగుపెట్టిన బెంగాల్‌కు సెమీఫైనల్లో భంగపాటు తప్పలేదు. 350 పరుగుల రికార్డు లక్ష్య ఛేదనలో బెంగాల్ 175 పరుగులే చేసింది. క్వార్టర్ఫైనల్లో పరుగుల విధ్వంసం సృష్టించిన బెంగాల్ సెమీస్‌లో ఆ స్ఫూర్తి చూపించలేదు. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 341 పరుగులు చేయగా.. బెంగాల్ 273 పరుగులే చేసింది. మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 281 పరుగులు చేసింది. బెంగాల్‌ను కుప్పకూల్చిన మధ్యప్రదేశ్ 174 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. జూన్ 22న చిన్నస్వామి స్టేడియంలో జరిగే రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబయి, మధ్యప్రదేశ్ తలపడనున్నాయి.