Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్లో మీడియా హక్కులకు ప్రత్యేక టెండరు
దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఐదేండ్ల మీడియా హక్కుల వేలంతో సుమారు రూ.50 వేల కోట్లు సొంతం చేసుకుని ప్రపంచ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ మీడియా హక్కులకు లభించిన విశేష ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. బీసీసీఐ బాటలోనే నడిచేందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సిద్ధమైంది. ఈ మేరకు ఐసీసీ మీడియా హక్కుల టెండరు ప్రక్రియలో భారత మార్కెట్కు ప్రత్యేకంగా బిడ్లు ఆహ్వానిస్తోంది. ఐసీసీ ఈవెంట్ల కోసం రానున్న నాలుగు/ఎనిమిదేండ్ల కాలానికి మీడియా హక్కుల కోసం ఐసీసీ ఈ సోమవారం ఇన్విటేషన్ టు టెండరు (ఐటీటీ) విడుదల చేయనుంది. గతంలో మీడియా హక్కులను గుంపగుత్తగా ఇచ్చేసిన ఐసీసీ.. ఈ సారి విభాగాలుగా అమ్మనుంది. టెలివిజన్, డిజిటల్ సహా టెలివిజన్-డిజిటల్ విభాగాలు చేసింది. అండర్-19 ప్రపంచకప్ నుంచి సీనియర్ మెన్స్ వరల్డ్కప్ వరకు అన్ని ఈవెంట్లు ఇందులో ఉంటాయి. తొలిసారి మహిళల క్రికెట్ మీడియా హక్కుల కోసం ఐసీసీ విడిగా టెండర్లు పిలువనుంది. మహిళల విభాగంలో నాలుగేండ్ల కాలానికి బిడ్లు ఆహ్వానిస్తోంది. మెన్స్ క్రికెట్లో నాలుగేండ్ల కాలానికే బిడ్లు వస్తే.. మరో నాలుగేండ్ల కాలానికి విడిగా మళ్లీ బిడ్లు ఆహ్వానించనుంది. తొలుత భారత మార్కెట్ మీడియా హక్కులకు బిడ్లు తీసుకోనుంది. భారత మార్కెట్ ముగిసిన తర్వాతే ఇతర దేశాలకు రీజియన్ల వారీగా టెండర్లు పిలువనుంది.