Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 86.69 మీటర్ల త్రోకు స్వర్ణం
న్యూఢిల్లీ : ఒలింపిక్ చాంపియన్, భారత అథ్లెటిక్స్ సూపర్‌స్టార్ నీరజ్ చోప్రా సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టాడు. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల ముంగిట యూరోపియన్ సీజన్లో పోటీపడుతున్న నీరజ్ చోప్రా తొలి స్వర్ణం సాధించాడు. ఫిన్లాండ్లో కోర్టెనె గేమ్స్‌లో నీరజ్ చోప్రా పసిడి ప్రదర్శన చేశాడు. 24 ఏండ్ల నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే బల్లెమును 86.69 మీటర్ల దూరం విసిరాడు. నీరజ్ చోప్రా తర్వాతి రెండు త్రోలు ఫౌల్‌గా వచ్చాయి. దీంతో ఒకే ఒక్క త్రోనే నీరజ్ చోప్రా బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. వరల్డ్ చాంపియన్ అండర్సన్ పీటర్స్ మరోసారి నీరజ్ చోప్రాను అందుకోలేకపో యాడు. పీటర్స్ 84.75 మీటర్ల త్రోతో మూడో స్థానంతో సరిపెట్టుకోగా, 2012 ఒలింపిక్స్ చాంపియన్ వాల్కోట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో) 86.64 మీటర్ల త్రోతో రజత పతకం సాధించాడు. ఇటీవల నుర్మి గేమ్స్‌లో 89.30 మీటర్ల త్రోతో సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పిన నీరజ్ చోప్రా.. తాజాగా బల్లెంను తక్కువ దూరం విసిరినా స్వర్ణంతో అగ్రస్థానంలో నిలిచాడు.