Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కామన్వెల్త్ క్రీడలకు హాకీ ఇండియా
న్యూఢిల్లీ : 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలకు హాకీ ఇండియా పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేసింది. బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడలు, హౌంగ్జౌ ఆసియా క్రీడలు స్వల్ప విరామంలో ఉండటంతో కామన్వెల్త్కు ద్వితీయ శ్రేణి జట్టును పంపాలని అనుకున్నారు. చైనాలో కోవిడ్-19 పరిస్థితుల దృష్ట్యా ఆసియా క్రీడలు వాయిదా పడ్డాయి. దీంతో కామన్వెల్త్ క్రీడలకు బలమైన జట్టును ఎంపిక చేస్తూ హాకీ ఇండియా సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. టోక్యో ఒలింపిక్స్ విజయ సారథి మన్‌ప్రీత్ సింగ్‌కు సారథ్య పగ్గాలు దక్కగా.. డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత్‌కు నాయకత్వం వహిస్తున్న అమిత్ దాస్ జట్టులో నిలిచాడు. 18 మందితో కూడిన జట్టులో సీనియర్ గోల్ కీపర్ శ్రీజేశ్ సైతం చోటు సాధించాడు. కామన్వెల్త్లో రెండు రజతాలు సాధించిన భారత్.. గ్రూప్-బిలో ఇంగ్లాండ్, కెనడా, వేల్స్, ఘనాలతో పోటీపడనుంది. జులై 31న ఘనాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
భారత హాకీ జట్టు : పీఆర్ శ్రీజేష్, కృష్ణన్ బహదూర్ పాఠక్ (గోల్ కీపర్లు). వరుణ్ కుమార్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్ (వైస్ కెప్టెన్), అమిత్ రోహిదాస్, జుగ్రాజ్ సింగ్, జర్మన్‌ప్రీత్ సింత్ (డిఫెండర్లు). మన్‌ప్రీత్ సింగ్ (కెప్టెన్), హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, శంషర్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, నీలకంఠ శర్మ (మిడ్ ఫీల్డర్లు). మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యారు, అభిషేక్ (ఫార్డర్లు).