Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యువ బ్యాటర్‌పై చీఫ్ కోచ్ ద్రవిడ్
బెంగళూర్ : భారత సారథ్య పగ్గాలు అందుకున్న రిషబ్ పంత్ విమర్శలు సైతం అధికం చేసుకున్నాడు. పంత్ బ్యాటింగ్ తీరు, స్ట్రయిక్‌రేట్ సహా ఫిట్‌నెస్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. రానున్న టీ20 ప్రపంచకప్‌కు పంత్ స్థానంలో కార్తీక్‌ను ఆడించాలనే డిమాండ్ ఎక్కువవుతోంది. సఫారీతో సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో 58 పరుగులే చేసి నిరాశపరిచాడు. పంత్‌పై విమర్శల నేపథ్యంలో చీఫ్ కోచ్ ద్రవిడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ' మిడిల్ ఓవర్లలో మరింత దూకుడుగా ఆడాలని కోరినప్పుడు.. ఒకట్రెండు మ్యాచుల్లో ప్రదర్శనతో నిందించలేం. పంత్ ఐపీఎల్లో బాగా ఆడాడు. స్ట్రయిక్‌రేట్‌లో గొప్ప పురోగతి సాధించాడు. భారత్‌కు సైతం ఆ స్థాయిలో ఆడాలని కోరుకుంటున్నాం. కొన్ని మ్యాచుల్లో విఫలమైనా.. పంత్ త్వరలోనే మంచి గణాంకాలు నమోదు చేయగలడు. భారత బ్యాటింగ్ ప్రణాళికల్లో పంత్ కీలకం. అతడి సామర్థ్యం మనకు తెలుసు. రానున్న రోజుల్లో భారత ప్రణాళికల్లో రిషబ్ పంత్‌ది పెద్ద పాత్ర' అని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టు కోసం పంత్, శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రాహుల్ ద్రవిడ్ సోమవారమే లండన్‌కు బయల్దేరాడు.